– గుడి తండాలో సేవాలాల్ ఉత్సవాలు
– హాజరైన జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తూరు
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు ఆదివారం మండ లంలోని మల్లాపూర్ తండా పరిధిలోగల గుడి తండాలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు స్థానిక జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్య నారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల హక్కులకై పోరాడిన సేవాలాల్ మహారాజ్‌ను గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో గూడూరు మాజీ సర్పంచ్ సత్తయ్య, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గిరిజన నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.