– జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్..
– విధులు బహిష్కరించి ధర్నా..
నవతెలంగాణ – ధూల్ పేట్
వైద్య విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా ఆస్పత్రి ముందు జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. సోమవారం ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి ఉస్మానియా ఆస్పత్రి, కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. వైద్య విద్యార్థులకు వెంటనే స్టై ఫండ్ చెల్లించాలని, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి, వైద్య విద్యార్థులకు ప్రతి నెలా స్టైఫండ్ చెల్లించాలని…మా వేతనం మా హక్కు అంటూ పెద్దపెట్టున నినా దాలు చేపట్టారు.
ఈ సందర్భంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసి యేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐజాక్ న్యూటన్, ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దీపాంకర్, ప్రధాన కార్యదర్శి చంద్రి కారెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ వెంటనే చెల్లించాలని గత ఆరు నెలులుగా ప్రభుత్వానికి విన్నవించినా పట్టిం చుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి నిరవధిక సమ్మెకు పూనుకు న్నట్టు తెలిపారు. జూడా ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా ఆందోళన విరమించమని చెప్తాన్నారే తప్ప తమ డిమాండ్లపై స్పష్టత లభించలేదన్నారు. గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీ వైద్యులకు రూ.2.05 లక్షల వేతనం చెల్లించాలని నిర్ణయించగా, ప్రస్తుత ప్రభుత్వం రూ.92వేలు చెల్లిస్తామని పేర్కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నట్టు తెలిపా రు. ఎన్‌ఎంసి గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పని ప్రదేశాల్లో భద్రత పెంచాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో భద్రత పెంచడంతో పాటు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేసి భద్రతను మరింత పటిష్టం చేసి ప్రాణాలను కాపాడే వైద్యులకు రక్షణ కల్పించాలన్నారు. గత ఆరేండ్లుగా ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామంటూ జాప్యం చేస్తున్నదని, దీంతో రోగులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వెంటనే ఉస్మానియా ఆస్పత్రి కొత్త భ వనంపై స్పష్టత ఇవ్వడంతో పాటు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు తక్షణమే స్టైఫండ్ బకాయిలు చెల్లించడంతో పాటు స్టైఫండ్ను రెగ్యుల రైజేషన్ చే సి. ఆర్థిక శాఖ నుండి ఖచ్చిత మైన స్పష్టత ఇవ్వాలని, ప్రతి నెలా ఏ తేదీన చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2024-25 సంవ త్సరం మొత్తానికి బడ్జెట్ కేటాయించినట్లు ప్రభు త్వం చెబుతుందని, తాము స మ్మె చేపట్టడంతో ఈ సంవత్సరానికి బడ్జెట్ కేటాయించడం కాదని, ప్రతీ సంవత్సరం స్టైఫండ్ కోసం రెగ్యులర్‌గా బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం స్ప ష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
బేగంపేట : ఇక గాంధీ ఆస్పత్రిలోనూ జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభ మైంది. అత్యవసర సేవలు మినహా ఒపీ,వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపి వేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలి పారు. సోమవారం గాంధీ ఆస్పత్రిలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ సకాలంలో స్టైఫండ్ చెల్లించడం,సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల భద్రత, నీట్ లో 15 శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు కేటాయిం చడం, ఆస్పత్రిలో మౌలిక వైద్య సదు పాయాలు మెరుగు పర్చడం,నూతన వసతి గహాల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.