
జిల్లా బేస్ బాల్ జట్టును ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల క్రీడామైదానంలో జిల్లా సీనియర్ పురుషుల బేస్ బాల్ జట్టు ఎంపికను జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రారంభించినట్లు జిల్లా బేస్ బాల్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తెలిపారు. బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు L. మధుసూదన్ క్రీడాకారుని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర పోటీలలో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలవాలని, ఎంపికైన క్రీడాకారులలు ఈనెల 13 నుండి 15 వరకు మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే రాష్ట్ర బేస్ బాల్ పురుషుల ఛాంపియన్ షిప్ పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ యొక్క ఎంపిక కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, వ్యాయమ ఉపాధ్యాయులు కొటలా సంజీవ్ కోచ్ నరేష్ లు పాల్గొన్నారు.