అమరుల త్యాగాలతోనే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారం

– హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
అమరుల త్యాగాలతోనే తెలంగాణ స్వరాష్ట్ర కళా సహకారమైందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన అమరుల సంస్మరణ సభకు హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి, సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ అమరుల త్యాగాలను గుర్తుచేసుకొని స్మరించుకోవడం మన అందరి కర్తవ్యమని అన్నారు. అమరుల స్మరణతోనే పాలన మొదలైందని అన్నారు. అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, అమరుల ఆశయ సాధనకై తెలంగాణ పౌర సమాజం అందరం పునరంకితం కావాలన్నారు.సీఎం కేసీఆర్ అధ్యక్షతన దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలుపుకోవాలని ఆకాంక్షించారు.

Spread the love