విద్యా, నిరుద్యోగ అంశాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..

The effigy of the Congress government, which left the issues of education and unemployment in the air..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి,జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి కోలా లక్ష్మినారాయణ, పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డు లో  విద్యా,నిరుద్యోగ అంశాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ  దిష్టిబొమ్మ దగ్ధం ేసి ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు  మాటలాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.రెండవసారి నూతనంగా ఏర్పడిన  రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పై నిరుద్యోగులు, విద్యార్థులు గంపెడంతా ఆశలు పెట్టుకున్నారు అని తెలిపారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ను చూస్తే ఉసురుమనేలా ఉందన్నారు.రాష్ట్ర బడ్జెట్ ను పరిశీలిస్తే నిరుద్యోగం,విద్యా అంశాలను గాలికి వదిలేసినట్లు కనిపిస్తుంది.మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్లు కాదా దీనిలో కేవలం 21,292 కోట్లు విద్యారంగానికి కేటాయించడం ఏంటని వారు విమర్శించారు.విద్యార్థులకు ఇవ్వవలసిన సుమారు 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు కనీసం వాటి ఊసే ఎత్తలేదు అని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు రెడ్ కార్పెట్ పరచడం, ఫీజుల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే విధంగా వీరి బడ్జెట్ ఉంది అని విమర్శించారు. పోటీ పరీక్షలు వాయిదా వేయమని నిరుద్యోగులు అడిగితే  జాబ్ క్యాలెండర్ వేస్తామని దాని ద్వారానే పోస్టులను భర్తీ చేస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు.జాబ్ క్యాలెండర్ విధివిధానాలను అసెంబ్లీ సమావేశాల్లో ఖరారు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం “జాబ్ క్యాలండర్”త్వరలో ఇస్తామని దాటవేత ధోరణిని ప్రదర్శన నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ సర్కార్  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులను కేటాయించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి స్పష్టమైన విధివిధానాలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  లేని యేడల ఈ నెల 31 నా  వేలాదిమంది విద్యార్థి యువకులతో కలిసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం పి డి ఎస్ యు, పి వై ఎల్  నాయకులు  జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గొర్రెపాటి రమేష్, జిల్లా కోశాధికారి బండి రవి, వీరబోయిన లింగయ్య, దండి ప్రవీణ్, ఉపేందర్, వినోద్, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

Spread the love