Sunday, May 24, 2026
E-PAPER
Homeనల్లగొండగ్రామ ప్రజల కోసం తండ్రి తనయుల కృషి అభినంద‌నీయం

గ్రామ ప్రజల కోసం తండ్రి తనయుల కృషి అభినంద‌నీయం

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
బస్వపూర్ రిజర్వాయర్ లో తాము పుట్టిపెరిగిన ఊరు బిఎన్ తిమ్మాపురం గ్రామం ముంపునకు గురికావడం జీర్ణించుకోలేక తమ గ్రామ ప్రజల బాగు కోసం ఎంత దూరమైన వెళ్లి తన గ్రామ ప్రజల కొరకు న్యాయం చేయాలని ఆరాట పడుతూ, పరితపిస్తున్న భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి, వారి కుమారుడు బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి లు చేస్తున్న పోరాటం చాలా అభినందనీయమని బిఎన్ తిమ్మాపురం నిర్వాసితులు అన్నారు.గతంలో ఎడ్ల సత్తి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రజా భవన్ లో కలిసి మా గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయాలని స్వయంగా కలిసి వివరించి వినతి పత్రం ఇచ్చారు.వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి 30 కోట్ల నష్టపరిహారం విడుదల చేశారు. ఇప్పుడు వారి కుమారుడు ఎడ్ల వెంకట్ రెడ్డి కూడా తన తండ్రి అడుగుజాడల్లో పయనిస్తూ, తాను పుట్టిపెరిగిన ఊరు బస్వపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతుందని తీవ్ర కలత చెంది తమ గ్రామప్రజలకు ఏ విదంగానైన న్యాయం చేయాలనే ఉద్దేశం తో గ్రామ ప్రజలందరి ఆమోదయోగ్యంతో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎడ్ల వెంకట్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి గ్రామ ప్రజలకు రావాల్సిన మిగతా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ని కలవడం అభినందనీయమని అన్నారు.

గ్రామ ప్రజల కోసం నిరంతరం తపనపడుతూ ప్రజలకు ఎలాంటి చిన్న ఆపద,సమస్యలు వచ్చినా మమ్ములను ఆదుకునే గుణం తండ్రి కొడుకులు ఎడ్ల సత్తి రెడ్డి, ఎడ్ల వెంకట్ రెడ్డి ఉండడం, మా గ్రామం కోసం పోరాడే నాయకులు మా గ్రామంలో ఉండడం మా గ్రామం చేసుకున్న అదృష్టమని గ్రామ ప్రజలు కొనియాడారు.వీలు చిక్కినప్పుడల్లా ఎప్పటికప్పుడు భువనగిరి ఎమ్మల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి , కలెక్టర్ నుంచి మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు మా నిరాసితుల న్యాయం కోసం పోరాడి, సమస్యలు వినిపించే నాయకులు మా గ్రామ ప్రజల కొరకు గళం విప్పి మాట్లాడి పోరాటం చేసి నాయకులు ఉండడం మా గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని నిర్వాసితులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -