తెలుగువారి ఆత్మగౌరవం కోసంమే టిడిపి ఆవిర్భావం

 – 9 నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ దే 
 – తెలంగాణ అభివృద్ధి లోను ఎనలేని కృషి
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : పేదలు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని రాష్ట్ర ప్రధానకార్యదర్శి  తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి ఎల్.వి.యాదవ్ లు అన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి  తుమ్మల మధుసూదన్ రెడ్డి  హాజరై జెండా ఎగురవేశారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి  తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ ఇంచార్జి ఎల్.వి.యాదవ్ లు మాట్లాడారు.  పేదల కష్టాలు చూసి వారి కన్నీళ్లను తుడిచే  అందుకే  స్వర్గీయ ఎన్టీఆర్  ఆనాడు టిడిపి  పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. పార్టీ స్తాపించిన 9 నెలలలోనే  అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి లో తెలుగుదేశం పార్టీ ఎనలేని కృషి చేసిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల జీవితలలో వెలుగు నింపిందని తెలిపారు. ముక్యంగా తెలంగాణాలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలను  చైతన్య పరచి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకె దక్కుతుందని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు  యువత భవిష్యత్ కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, మహిళా సంఘాల ద్వారా చైతన్య పరచారని ఈ సందర్భంగా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దొరల పాలన, గడిలపాలనను పాల ద్రోలరని  అన్నారు. ఈ కార్యక్రమంలో హుజుర్నగర్ నియోజకవర్గ ఇంచార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్, నల్గొండ పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, నల్గొండ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ధీరావత్ మాన్య నాయక్, పార్లమెంట్ అధికారప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునూరి సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శి ఎం కె ఐ  సిద్ధిక్, తిప్పర్తి మండల అధ్యక్షులు దొంతినేని నర్సింహా రావు, గరిడేపల్లి మండల అధ్యక్షులు కీసరి నాగయ్య, నల్గొండ పట్టణ ప్రధానకార్యదర్శి గోగుల నాగరాజు,  నాయకులు  రవి, భూతం వెంకటయ్య  తదితరులు పాల్గొన్నారు.
Spread the love