ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000/- లు నిర్ణయించాలి

– లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం 
– సిఐటియు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ 
నవతెలంగాణ- కంటేశ్వర్
ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 నిర్ణయించాలని లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా సిఐటియు కార్యాలయంలో ఆశా వర్కర్ల జిల్లా ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.  సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశ వర్కర్స్ గత 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని, అయిన వీరికి ఇప్పటివరకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు.ఈ కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు అనేక రేట్లు పెరిగాయని మరోవైపు గతంతో పోలిస్తే పని భారం కూడా బాగా పెరిగిందని ఉన్నారు. ఆశాలకు గతంలో ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదని, రిజిస్టర్ ఇవ్వలేదని, యూనిఫామ్ క్వాలిటీ ఉండటం లేదని, అనేక ప్రాంతాల్లో రెస్ట్ రూమ్ లు కూడా ఏర్పాటు చేయలేదని, జాబ్ చార్ట్ కూడా ఇంకా ఇవ్వలేదని, దీనివల్ల అనేక రకాల పనులు ఆశ వర్కర్లు చేయాల్సి వస్తుందని పని భారం పెరిగి ఆశ వర్కర్లు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ జిల్లా ఆఫీస్ బేరర్ రేణుక, సుకన్య,బాలమణి, రమ, లావణ్య, విజయ రాజమణి, లావణ్య, శాంతి ఎల్ సుజాత సిహెచ్ పద్మ వర్ష శోభ పాల్గొన్నారు.

Spread the love