మునుగోడు సమస్యల్ని పట్టించుకోని అసమర్థ ఎమ్మెల్యే

The former is an incompetent MLA who does not care about the issues– బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి
నవతెలంగాణ – చండూరు
మునుగోడు ప్రాంత అభివృద్ధి సమస్యలు పట్టించుకోని  అసమర్థుడు  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి  తీవ్రంగా విమర్శించారు. మంగళవారం స్థానిక భారతి చంద్ర  గార్డెన్స్ లో పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతం మీద అవగాహన లేని వ్యక్తి ,  అభివృద్ధికి నోచుకోలేని ఎమ్మెల్యే కి మంత్రి పదవి కావాలని ఎద్దేవా చేశారు. మండలాలలో పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. తను ప్రజలు నమ్మించి గెలిపిస్తే అంతను అభివృద్ధి చేయకుండా ప్రజలు మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలను మరచి బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. బీసీ, ఎస్సీ, రైతు డిక్లరేషన్ అంటూ ఎన్నో డిక్లరేషన్ లో పేరుతో ఎన్నికలలో ఓట్లు వేయించుకొని వారు చెప్పిన డిక్లరేషన్లకే బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వారికి కూడా బీఆర్ఎస్ గతే పడుతుందన్నారు. స్థానిక సంస్థలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఆ దిశగా కార్యకర్తలు సంసిద్ధత కావాలన్నారు. గ్రామాలలో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్, ఎంపీపీ, జడ్పిటిసి రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసి కార్యకర్తలు అందరూ వారి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.  భారత దేశాన్ని మూడవ ఆర్థిక శక్తిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నిటిని గ్రామస్థాయి ప్రజల వరకు తీసుకెళ్లి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ముదికొండ ఆంజనేయులు, అసెంబ్లీ కన్వీనర్  దుడల బిక్షం గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు సోమ నరసింహ, జక్కర్తి లింగస్వామి,రాష్ట్ర ఒబిసి  అధికార ప్రతినిధి కోమటి వీరేశం, పిన్నింటి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి,  బోయపల్లి రాజు,జిల్లా అధికార ప్రతినిధి నకరికంటి  లింగ స్వామి, సోషల్ మీడియా కన్వీనర్,మాదగోని నాగార్జున, ఏనుగు వెంకట్ రెడ్డి, బొబ్బల మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love