మహిళలకు శుభవార్త.. ఒక్కొక్కొరికి రూ.12 లక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మహిళలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని.. ఆ డబ్బుతో స్వయంగా పైకి ఎదగాలనీ, అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని  శాఖ మంత్రి సీతక్క కోరారు.  వచ్చే ఐదేళ్లలో బ్యాంకుల ద్వారా ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద రూ.లక్ష కోట్ల దాకా మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి సంస్థ, బ్యాంక్ లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25ను సీతక్క శనివారం రిలీజ్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000.39 కోట్ల డబ్బును 3,56,273 సంఘాలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె చెప్పారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు.
డిసెంబర్-2023 నుంచి మార్చి-2024 వరకు అడ్వాన్స్‌గా 2,59,864 మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.264.34 కోట్లు విడుదల అయ్యాయని సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2 లక్షల వరకు అప్పు బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్స్ కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించామని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని సంఘాల్లో మహిళలకు రూ.50 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. త్వరలో మహిళా సంఘాల్లోని మహిళల ద్వారానే మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె వివరించారు.

Spread the love