
సీపీఎం ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ మరియు వీరపనేని డాంగే సహకారంతో వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల విలువ చేసే వస్తువులను సహాయంగా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజుకు ములుగు జిల్లాలో ప్రాజెక్టునారులోని 13 కుటుంబాలకు మాత్రమే 25 వేల రూపాయలు ఇచ్చినారని ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా అధికారులు సర్వే చేయలేదని ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించితే స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాలు తప్ప ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కింద పది కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఇదేనా వరద సహాయమని ప్రశ్నించారు .ప్రభుత్వ వెంటనే జిల్లాలో పూర్తిగా దెబ్బతిన్న 550 కుటుంబాలకు డబుల్ బెడ్ రూములు నిర్మించాలని పాక్షిక దెబ్బతిన్న ఇండ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు నగర్ గ్రామంలో భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకున్న రక్షణ లేదని ఆ గ్రామస్తులు అందరు కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలన్నారు . దాదాపు 3000 ఎకరలు దెబ్బతింటే వేరాది మోటర్లు కొట్టుకపోయిన ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి సహాయం ప్రకటించలేదని ఎప్పుడు ప్రకటిస్తారని అన్నారు. ఈ సంవత్సరం నార్లు లేక వేసినట్లు ఎండిపోయి వేలాది మోటార్లు కొట్టుకుపోయి కరెంటు లేక ఈ సంవత్సరం పంట కోల్పోయినరని వారందరినీ కూడా ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేశారు .ఎకరాకు 50వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు*ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సనప సమ్మయ్య సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి పొదిల్ల చిట్టిబాబు గొంది రాజేష్ మండల్ నాయకులు అంబాల మురళి అంబాల పోషాలు కొట్టెం కృష్ణారావు బి సంజీవ పిట్టల అరుణ్ జిమ్మ జ్యోతి అచ్చమ్మ బత్తుల స్వరూప శ్రావణ్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.