Tuesday, July 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి

- Advertisement -


 ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-షాబాద్

ఆరు హత్యల విషాద ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆమె, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. నిందితుని భార్య సరిత తల్లిని, బాలిక అక్షయ సోదరి మానసిక శారీరక వికలాంగురాలు మేఘనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వికలాంగురాలైన మేఘనకు కలెక్టర్ ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక హోమ్ కేటాయించి, ఆమె సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోపాలు ఉన్నాయని అన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో.. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విజయమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు మస్కు అరుణ తదితరులు ఉన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -