మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-వరంగల్
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నట్టు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సోమవారం వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దేశ్‌పాండే ఫౌండేషన్, దాతల సహకారంతో రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన స్కిల్ ప్లస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. అనంతరం చంద్రకాంతయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించగా, అతిథులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. యువత నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దాత ఎన్‌సీ మూర్తి మాట్లాడుతూ.. ఈ కళాశాలలో చదివి విదేశాల్లో స్థిరపడిన తమ లాంటి పూర్వ విద్యార్థులు తమ స్వస్థల అభివృద్ధికి చేయూతనివ్వడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. యువత కంప్యూటర్ నైపుణ్యాలు నేర్చుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో దేశ్‌పాండే ఫౌండేషన్ ద్వారా ఈ స్కిల్ ప్లస్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం అతిథులు, దాతలను కళాశాల యాజమాన్యం సన్మానించింది. తదనంతరం జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి. పోశయ్య, మాజీ ప్రిన్సిపాల్ ఎ. ధర్మారెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మీసాల ప్రకాశ్, జీవన్ మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



