కాల్పులు జరిపిన స్టూడెంట్‌కు పదేండ్ల జైలు శిక్ష : హైకోర్టు

నవతెలంగాణ-హైదరాబాద్‌
ర్యాగింగ్‌ పాల్పడిన సందర్భంగా హైదరాబాద్‌, దారుసలాంలోని దక్కన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో 2007లో ఫైరింగ్‌కు పాల్పడిన మహమ్మద్‌ ఉమీదుల్లా ఖాన్‌కు హైకోర్టు పదేండ్ల జైలు శిక్షను విధించింది. లోయర్‌ కోర్టు గతంలో ఖాన్‌కు పదేండ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పును కొట్టేయాలని ఖాన్‌ వేసిన అప్పీల్‌ను జస్టిస్‌ వేణుగోపాల్‌ కొట్టేశారు. దక్కన్‌ కాలేజీలో ముఖర్రం సిద్ధిఖీపై కాల్పులపై నమోదైన కేసులో పదేండ్ల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానాలను విధిస్తూ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలన్న ఖాన్‌ అప్పీల్‌ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమన్నారు. బీటెక్‌ చదివే ఖాన్‌కు కాల్పులు జరిపితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలుసుననీ, కావాలనే కాల్పులు జరిపినట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. ప్రాసిక్యూషన్‌లో జోక్యానికి ఆస్కారం లేదనీ, కింది కోర్టు తీర్పులో జోక్యానికి వీల్లేదని స్పష్టం చేశారు.

Spread the love