Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదర్శప్రాయురాలు కమలమ్మ

ఆదర్శప్రాయురాలు కమలమ్మ

- Advertisement -

సీపీఐ(ఎం) పొలిట్‌ ‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు భుక్యా వీరభద్రం మాతృమూర్తి సంతాపసభ

​నవతెలంగాణ-ఖమ్మంరూరల్
సీపీఐ(ఎం) నాయకురాలు భూక్య కమలమ్మ ఆదర్శప్రాయురాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భుక్యా వీరభద్రం మాతృమూర్తి కమలమ్మ సంతాప సభ సందర్భంగా ఖమ్మం రూరల్‌ ‌మండలం కస్నాతండాలో కమలమ్మ చిత్రపటానికి బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలమ్మ.. తన ఇద్దరు కుమారులు.. వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, పాలేరు డివిజన్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావును ప్రజా ఉద్యమాలకు అందించి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. కమలమ్మ భర్త సామ్య నాయక్‌‌ను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్‌, శ్రీరామ్ నాయక్, బండి రమేష్, బుగ్గవీటి సరళ, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, కాచిరాజుగూడ సర్పంచ్ బానోత్ హరి, కస్నా తండా ఉపసర్పంచ్ అవిరేణి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, కాంగ్రెస్ మండల అధ్యక్ష‍ులు తోట వీరభద్రం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -