Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచర్చల్లో అంగీకరించిన సమస్యలను పరిష్కరించాలి

చర్చల్లో అంగీకరించిన సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

ఆర్టీసీ ఎండీకి ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మె చర్చల సందర్భంగా అంగీకరించిన సమస్య లను వెంటనే పరిష్కరించాలని ఎస్‌‌ డబ్ల్యూఎఫ్‌ ‌(‌సీఐటీయూ) డిమాండ్‌ ‌చేసింది. అలాగే ప్రభుత్వం పరిష్క రించిన మూడు సమస్యలను వదిలేసి మిగతా వాటిపైన యాజమాన్యం దృష్టి సారించాలని కోరింది. కొన్ని సమస్యలపై ఎండీతో చర్చించి నిర్ణయం చేస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన అన్నీ సమస్యలపై ప్రభుత్వ సహకారం కోరాలని ఎండీ నాగిరెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రచార కార్యదర్శి పి. రవీందర్‌‌రెడ్డి, హైదరాబాద్‌ ‌రీజియన్‌ అధ్యక్షులు లింగంతో కూడిన ప్రతినిధి బృందం ఎండీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలపై ఎండీతో సుదీర్ఘంగా చర్చించారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాలతో జరిగిన చర్చల ప్రోసిడింగులను విడుదల చేయాలని కోరారు. అలవెన్స్‌‌ల విషయం తేల్చాలనీ, ఉద్యోగ భద్రతపై కమిటీని నియమించాలనీ, బ్రెడ్‌ ‌విన్నర్‌ ‌స్కీమ్‌‌ను అమలుచేయాలని సూచించారు. ఆర్టీసీలో నిబంధనలకు అనుగుణంగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పారు. జూనియర్‌ అసిస్టెంట్‌ ‌టెస్ట్‌ ‌పాసైన వారికి పోస్టింగులు ఇవ్వాలని చెప్పారు. కార్మికులపై పనిభారం తగ్గించాలి కోరారు. రిటైరైన కార్మికుల విషయంలో ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -