సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపేల్లి సైదులు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటాలు ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. సోమవారం సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించి అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసం పెల్లి సైదులు మాట్లాడుతూ.. ఎండనక వాననక రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులు దాటిన ఇంతవరకు కాంటాలు ప్రారంభించకపోవడం వలన రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చెందారు. రైతులు భగభగ మండే ఎండలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కనీస వసతులు మంచినీళ్లు సౌకర్యం టెంటు ఇలాంటి సదుపాయాలు లేకపోవడం వలన రైతాంగం ఇబ్బంది పడుతున్నారని ఆవెదన వ్యక్తం చేశారు.
తక్షణమే అధికారులు స్పందించి ధాన్యం కాంటాలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు మండలంలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్న రైతుల ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే కాంటాలు స్పీడ్ అప్ చేయాలని బస్తాలు లారీలను సమకూర్చాలని రైతాంగాన్ని ఎలాంటి ఇబ్బందులకు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి లారీల కాంట్రాక్టర్ తో మాట్లాడి మార్కెట్లో కాంటాలను పెట్టేందుకు ఎక్కువ హమాలేని తీసుకువచ్చి కాంటాలు నిర్వహించిన వెంటనే మెల్లగా తరలించి అక్కడికి తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. అలా చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ఎంత అద్వానంగా కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొల్లం ఎల్లయ్య బొంతల బిక్షపతి కవిత వెంకటయ్య తదితర రైతులు పాల్గొన్నారు.



