ఎన్డీయే ప్రభుత్వం ఏక్షణంలోనైనా పడిపోవచ్చు: ఖర్గే

నవతెలంగాణ – బెంగళూరు: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు పొరపాటున జరిగిందన్నారు. మోడీకి మరో అవకాశం లేదని చెప్పుకొచ్చారు. ఇది మైనార్టీ ప్రభుత్వమని ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. కానీ, తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం తాము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. దేశానికి మంచి జరగనివ్వకుండా చేయడం ప్రధాని మోడీకి అలవాటని విమర్శించారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటుందన్నారు.

Spread the love