కొత్త చెరువు కనుమరుగు

– చెరువును మింగేస్తు ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
– ప్రహరీలు నిర్మించిన వారిపై నోటీసులు ఇచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి గ్రామస్తులు
నవతెలంగాణ-కందుకూరు
కొత్తచెరువును అక్రమార్కులు మింగేస్తున్నారు. దీంతో చెరువు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అధికా రుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. ఇరిగేషన్‌ అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో అక్రమార్కులు ఏకంగా చెరువునే మింగేయాలని చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, నేదునూరు గ్రామంలో సర్వే నబర్‌ 692 మొత్తం ఎకరాలు 38, వంద సంవత్సరాలు, అంతకు ముందు నుండి చెరువు ఉందని గ్రామస్తులు తెలి పారు. ఇలాంటి చెరువును మింగేసి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామానికి ఆనుకొని దగ్గర ఉండడంతో చెరువు శిఖం కొంతమంది కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. దీంతోపాటు చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం ఉండకుండా చెరువులోని భూమి ధ్వం సం చేసి, ప్రహరి గోడ నిర్మించారు. అక్రమాలకు అడ్డు అదుపే లేదు. ప్రభుత్వ, ప్రయివేట్‌ భూములైన చెరువులో వర్షపు నీరు నీటిమట్టం ఉన్న స్థాయిలో ఎలాంటి నిర్మా ణమూ చేపట్ట రాదని తెలిసిందే. చెరువు శిఖంలో పూర్తిస్థా యి నీటిమట్ట హద్దులు ఉన్న దగ్గర కూడా నిర్మాణాలు చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కొత్త చెరువులో ప్రహరీ గోడల నిర్మాణం చేసిన వారిపై నోటీసులు ఇచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొత్త చెరువు శిఖంలో పూర్తిస్థాయి నీటిమట్టం హద్దులు చూపించి చెరువును కాపాడుతాం
కొత్తచెరువు శిఖంలో పూర్తిస్థాయి నీటిమట్టం హద్దులు చూపించి చెరువును కాపాడుతామన్నారు. ఎలాంటి నిర్మా ణాలూ జరగకుండా తగుచర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టంలో ఎలాంటి నిర్మాణాలున్నా వారం దరికీ నోటీసులు ఇచ్చి శాఖపరమైన చర్యలు తీసుకుం టామని తెలిపారు.
– నీటి పారుదల అధికారి గోపాల్‌

కొత్తచెరువు పూర్తిస్థాయి నీటిమట్టం హద్దులు చూపించి చెరువును కాపాడండి
నీటి పారుదల శాఖ అధికారులు చెరువు పూర్తి స్థాయి నీటిమట్టం హ ద్దులు పాతినా ఉప యో గం లేకుండా పోయిం దన్నారు. చెరువు శిఖం భూమిలో ప్రహరీ నిర్మా ణం చేపట్టిన వారికి పా ట్లు కొన్న వారికి అనుమతులు ఉన్నాయా లేవా అని సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. వారి నిర్ల క్ష్యంతోనే చెరువు శిఖంలో ప్రహరీ నిర్మాణాలు, జరుగుతు న్నాయని ఆరోపించారు. 2019 సెప్టెంబర్‌లో 20తేదీన కందుకూరు ఆర్‌ఐ, సర్వేయర్‌ హద్దులు చూపించి పో యారు. ఇప్పుడు లేవు. చెరువు శిఖంలో ఉన్న ప్రతి నిర్మా ణాన్ని కూల్చివేయాలని, అక్రమంగా ప్రహరీ నిర్మాణం దారులకు నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని కోరారు.
– ఇంద్రకంటి రవీందర్‌ గౌడ్‌,మాజీ వార్డు సభ్యులు

Spread the love