నవతెలంగాణ గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు జిల్లాఅధ్యక్షుడు మెట్టపెంటయ్య తెలిపారు. అధ్యక్షులుగా ర్యావ బోయిన కిషన్, ఉపాధ్యక్షులు మన్నెపు రాజు, ప్రధాన కార్యదర్శిగా కంది సంజీవ్, కోశాధికారిగా మన్నెపు రాజశేఖర్ , సంయుక్తకార్యదర్శిగాజనార్దన్,సా యిలులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపధ్యక్షుడు కంది సాయిలు, జిల్లా కార్యవర్గసభ్యులు, వివిధ గ్రామాల నాయక్ పోడ్ సభ్యులు పాల్గొన్నారు.