ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతున్న గోదావరి..

– రామన్నగూడెం వద్ద అర్ధరాత్రి వరకు ఒకటి, రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
– లోతట్టు గ్రామాల ప్రజలను పునరవాస కేంద్రాలకు తరలించిన అధికారులు
– ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌష్ ఆలం, పిఓ అంకిత్
నవతెలంగాణ- ములుగు : మహారాష్ట్ర, చత్తీస్గడ్ ఘాడ్ రాష్ట్రాలతో పాటు తోపాటు తెలంగాణలో కూసిన భారీ వర్షానికి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రాష్ట్రంలోని కడెం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనుంచి భారీగా నీరు విడుదల చేయడంతో జిల్లాలోని కన్నయి గూడెం సమీపంలోని సమ్మక్క సాగర్ ప్రాజెక్టులోనికి భారీగా నీరు చేరింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 83 వేల మీటర్లు కాగా ఇప్పటికే 85 వేల మీటర్ల నీటి ప్రభావం పెరిగింది. దీంతో ప్రాజెక్టు 59 గేట్లు ఎత్తివేసి 13 లక్షల 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో గోదావరి నది పేరూరు వద్ద శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 18.010 మీటర్లు, రామన్నగూడెం వద్ద 16.090 మీటర్ల ఎత్తున ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రామన్నగూడెం వద్ద అధికారులు అర్ధరాత్రి వరకే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, అర్ధరాత్రి తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన అధికారులు ముందస్తుగానే ఎటునాగారం మంగపేట వాజేడు వెంకటాపురం మండలాల్లో పునరవాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు గ్రామాల ప్రజలను కేంద్రాలకు తరలించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, ఎటునాగారం ఐటిడిఏ పిఓ అంకిత్ లు పర్యవేక్షిస్తున్నారు. గత 12 గంటల నుంచి జిల్లాలో వర్షం కురువక పోయిన గోదావరి పొంగి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజలు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రహదారులు దెబ్బతిని కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో వాటిని పునరుద్ధరించేందుకు సహాయ చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ఆధర్య పడవద్దని అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు.

Spread the love