Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు

కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు

- Advertisement -

​సుడా, జిల్లా గ్రంథాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలి : 
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నిబద్ధత, నిజాయితీతో పని చేస్తే గుర్తింపు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అభివృద్ధికి ముగ్గురు మంత్రుల కృషి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

నవతెలంగాణ-ఖమ్మం
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మెన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహమ్మద్ ఖాదర్ బాబాల అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నాయకులకు పదవులు వచ్చినప్పుడు కార్యకర్తలు చూపుతున్న ఆనందం పార్టీపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.

దేశ స్వాతంత్య్ర సమరానికి ముందే గ్రంథాలయ ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, జనగాం ప్రాంతాలు ఆ ఉద్యమాలకు కేంద్ర బిందువులుగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రజలపై అత్యంత ప్రభావం చూపే సంస్థ గ్రంథాలయమని, అలాంటి సంస్థకు చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న మహమ్మద్ ఖాదర్ బాబాకు అభినందనలు తెలిపారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేయాలని సూచించిన ఆయన, ప్రజలకు సేవలు అందించేందుకు అవసరమైన సహకారం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పనిసరిగా అందిస్తారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల అభివృద్ధి కోసం సాధించుకున్నామని, గత పాలకులు ప్రజల అవసరాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించారని విమర్శించారు.

ప్రతి ఏటా మహిళలకు 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి 550 బస్సులు కేటాయించినట్టు చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. జూన్ 2 నుంచి కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, 5 లక్షల బీమా సహాయం రక్షణ కవచంలా నిలుస్తుందని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులకు నేడు సుడా చైర్మెన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పదవులు రావడం సంతోషకరమని అన్నారు.

నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తే రాష్ట్ర నాయకత్వం తప్పకుండా గుర్తింపు ఇస్తుందని చెప్పారు. పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కు పదవి రావడం తనకు వ్యక్తిగతంగా ఆనందంగా ఉందని, ఖమ్మం నగరంతో పాటు పరిసర మండలాల అభివృద్ధికి సుడా ద్వారా మరిన్ని నిధులు తీసురావాలని సూచించారు. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డిప్యూటీ సీఎం, మంత్రి, ఖమ్మం ఎంపీ, సుడా చైర్మెన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల సంస్థ చైర్మెన్ నాయుడు సత్యనారాయణ, ప్రజా ప్రతిఁధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -