Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్‌

రవాణా శాఖ అదనపు కమిషనర్‌గా సి. రమేశ్‌

- Advertisement -

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రవాణా శాఖలో కీలక పదోన్నతి లభించింది. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ)గా విధులు నిర్వహిస్తున్న సి. రమేశ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదనపు రవాణా కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. 2025-26 ప్యానెల్ సంవత్సరానికి గానూ ఈ ప్రమోషన్‌ని ఖరారు చేస్తూ రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో రవాణా వ్యవస్థను చక్కదిద్దడంలో, కార్యాలయాల పనితీరును మెరుగుపరచడంలో ఆయన చూపిన చొరవకు ఈ ప్రమోషన్‌ దక్కినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

​సేవలకు దక్కిన గౌరవం
గడిచిన రెండున్నరేండ్లుగా హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా సి. రమేశ్‌ విశేష సేవలు అందించారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, కార్యాలయంలో పారదర్శకతను పెంచేందుకు కృషి చేశారు. ముఖ్యంగా శాఖాపరమైన సేవలను ప్రజలకు చేరువ చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ రూల్స్-1993 ప్రకారం రమేశ్‌ అర్హతను గుర్తించిన ప్రభుత్వం, నిబంధనలకు లోబడి ఈ ప్రమోషన్ కల్పించింది.

అందరి సహకారంతోనే ఇది సాధ్యం: సి. రమేశ్‌
తనకు పదోన్నతి కల్పించడం పట్ల సి. రమేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ జేటీసీగా నేను పనిచేసిన రెండున్నరేండ్ల కాలం అత్యంత సంతృప్తినిచ్చింది. ఈ ప్రయాణంలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా తోటి అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి తోడ్పాటు వల్లే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలిగాను. ఇప్పుడు లభించిన ఈ పదోన్నతితో మరింత బాధ్యతగా పని చేస్తాను” అని పేర్కొన్నారు. సి.రమేశ్‌కు పదోన్నతి లభించడం పట్ల రవాణా శాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -