కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్న దేశ ప్రజలు

నవతెలంగాణ-బయ్యారం
ప్రజా వ్యతిరేక విధానలను అవలంబిస్తున్న బిజెపి పా ర్టీకి కర్ణాటక ప్రజలు గట్టి బుద్ది చెప్పారని, దేశ ప్రజలు నేడు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సత్తుపల్లి ఆర్గనైజింగ్‌ కో-ఆర్డినేటర్‌ వడ్లమూడి సురేష్‌ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తపేటలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాం గ వ్యవస్థను ధ్వంసం చేయడం ప్రభుత్వరంగ వ్యవస్థలను అమ్మడం, ప్రభుత్వాలను కూలదోయడం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు దిగడం, నిరుద్యోగం, మిత్తిమీరిన అప్పులు, విప ˜లమైన మోదీ సర్కార్‌ని ప్రజలు తిరస్కరించారని, కర్ణాటక గెలుపుకు కషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 9 ఏళ్లుగా తెలంగాణలో మాయమాటలు చెప్పి అమలు కాని హామీలు, కళ్లిబొల్లి మాటలతో మోసం చేసింది బీఆర్‌ఎస్‌ వల్ల ప్రజలకు ఒరిగింది ఏమిలేదన్నారు. కర్ణాటక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రా బోయే ఎన్నికలలో కలిసికట్టుగా బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడిం చి కేసీఆర్‌ని ఇంటికి సాగనంపాలన్నారు.

Spread the love