మేడారం స్థానికులకే, మేడారం ట్రస్ట్ బోర్డ చైర్మన్ పదవి ఇవ్వాలి

– కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సిద్ధబోయిన రానా రమేష్
నవతెలంగాణ- తాడ్వాయి : మేడారం మహా జాతర కు, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అధ్యక్ష పదవిని మేడారం ఆదివాసి నాయకుల స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సిద్దబోయిన రానా రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మేడారంలో నవ తెలంగాణతో మాట్లాడుతూ మేడారంలో ఉండే స్థానికులకు మేడారం జాతరపై గ్రిప్(పట్టు) ఉంటుందని, మేడారం మహా జాతర అభివృద్ధికి సహాయపడతారని అన్నారు. మేడారంలో స్థానికంగా ఉండి ఎన్నో ఇబ్బందులు వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని అందరూ ఇబ్బందులలో ఉన్నారని తెలిపారు. మేడారం జాతర అభివృద్ధి జరగాలంటే మేడారంలో స్థానికంగా ఉన్న ఆదివాసులకి మేడం ట్రస్ట్ కూడా చైర్మన్ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి తీసుకుపోన్నట్టు తెలిపారు.
Spread the love