నవతెలంగాణ-మంచిర్యాల
మధ్యాహ్న బోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక చారువాక హాల్‌లో మధ్యాహ్న జోజన పథకం కార్మిక సంఘం (సీఐటీయూ) సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నేతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా దాసరి రాజేశ్వరి, కార్యదర్శిగా ఎండీ రఫీయ ఎన్నికయారు. ఈ సందర్భంగా రంజిత్‌కుమార్ మాట్లాడుతూ ఈ పథకం కింద పలు పాఠశాలల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, నెలల తరబడి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ప్రభుత్వం మధ్యాహ్నం భోజన కార్మికులపై చిన్న చూపు చూడడం సబబు కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మధ్యాహ్న భోజనం నిర్వహణకు గ్యాసు సిలిండర్‌ను సబ్సిడీ కింద ఇవ్వాలని, కార్మికులకు రూ.10000 గౌరవ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు సునీత, గడ్డం లక్ష్మి, మధునమ్మ, లక్ష్మి, కళావతి పాల్గొన్నారు.