మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 

The problems of model school employees should be resolved– పాఠశాల ముందు ప్లకార్డులతో  నిరసన తెలిపిన ఉద్యొగులు
నవతెలంగాణ – కోహెడ  
మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో మంగళవారం ప్లకార్డులతో  నిరసన తెలియజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా  ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న పీ.జీ.టీ, టీ.జీ.టీ ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల గత ప్రభుత్వంలో తీరని అన్యాయం జరిగిందన్నారు.  హెల్త్ కార్డులు లేక, సమయాని వేతనాలు రాక అనేక ఇబ్బందులకు గురయ్యామని ఉపాధ్యాయులు  ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీర్ఘకాలిక సమస్యలైన బదీలీలు, కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డులు, 010 నుండి ప్రతి నేల వేతనాలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.శారద, పావని, ఆర్.భవ్య, బీ.జ్యోతి, జీ.రాంనారాయణ, డీ.రమేష్, యం.శైలేజ, జీ.రాజు, వి.శ్రీనివాస్, జి.ఎల్. ప్రసన్న, బీ.రమేష్ పాల్గొన్నారు.
Spread the love