విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. 

– అడవి పదిర గ్రామనికి బస్సు సౌకర్యం కల్పించాలి 
– ఎల్లారెడ్డిపేట వెళ్ళే ప్రధాన రోడ్డుపై ధర్నా రాస్తారోకో 
నవతెలంగాణ – వీర్నపల్లి 
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలనీ ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామనికి బస్సు రాకపోవడంతో విధ్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎల్లారెడ్డిపేట మర్రి మడ్ల ప్రధాన రహదారి పై దర్నా రాస్తారోక చేపట్టారు .ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామనికి బస్సు రాకపోవడంతో విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్ళాలి అంటే 2 కిలోమిటర్ల దూరం నడిచి ప్రయాణించాల్సి ఉందని, ప్రతిసారి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు సమస్య పరిష్కారం చేయాలని అడిగితె అక్రమ కేసులు పెడతామనీ పోలీస్ లు అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని మండి పడ్డారు, ఈ బస్సు రాకపోవడానికి ప్రధాన కారణం వంతెన నిర్మాణం చేపట్టకపోవడం ద్వారానే వంతెన నిర్మాణం చేపట్టడం ద్వారా విద్యార్థుల, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి వంతెన మంజూరు అయి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు నిర్మాణ పనులు మొదలుపెట్టాక పోవడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారు. వాగు సాకుతో గ్రామనీకి బస్సు రాకుండా ఉండద్దనీ లాల్సింగ్ తాండ నుండి వయా వేసి అడవి పదిర గ్రామంలోకి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండ చూడాలన్నారు. ఆ బస్సు లో గురుకుల సంబందిత ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా నిరుద్యోగిని ఎస్ ఎఫ్ ఐ నాయకులు బైక్ పై గురుకుల ఎగ్జామ్ రాయడానికి తరలించారు. ధర్నా స్థలానికి పోలిస్ అధికారులు డి ఎం సాయంత్రం బస్సు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలొ నాయకులు విష్ణు వర్ధన్, జాషువా, విద్యార్థులు మనోఅభిషేక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love