చికాగో ఉద్యమంలో అమరుల రక్తంలో నుంచి పుట్టినదే ఎర్రజెండా..

నవతెలంగాణ – మునుగోడు

అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని విధానం కోసం జరుగుతున్న పోరాటం పై యాజమాన్యాల దాడికి బలైన అమరుల రక్తంలో నుండి పుట్టిన ఎర్రజెండా అనేక ఉద్యమాలు నిర్వహించి కార్మిక హక్కులు సాధించినది అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద సిపిఎం జెండాను , గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ , భవన కార్మికుల యూనియన్, పని ప్రదేశాలలో సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల శ్రమశక్తి ద్వారా సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని గద్దే దింపడానికి కార్మిక వర్గం సన్నద్ధం కావాల్సిందని అన్నారు. కార్మిక చట్టాల మార్పులు 8 గంటల పని విధానాన్ని తీసివేసి పన్నెండు గంటలు పని విధానాన్ని ప్రవేశపెట్టాలని చూడడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ , మండల కమిటీ సభ్యులు యాస రాణి శ్రీను , వేట యాదయ్య , సీనియర్ నాయకులు చిక్కుల నరసింహ , యాస రాణి వీరయ్య , యాట రాజు , రెడ్డి మల్ల యాదగిరి , ఎర్ర అరుణ , పెద్దమ్మ , అండాలు , స్వరూప , లలిత , ఎంకులు  తదితరులు ఉన్నారు.
Spread the love