శ్రమకు తగ్గ ఫలితం సున్న

– సీఐటీయూ నాయకుడు సురేష్ గొండ

నవతెలంగాణ – జుక్కల్
శ్రమకు తగ్గ ఫలితం సున్న ఉందని కామారెడ్డి జిల్లా సిఐటీయూ సబ్యుడు సురేష్ గొండ అన్నారు. బుదువారం నాడు జుక్కల్ మండల కేద్రంలో మేడే పురస్కరించుకుని వివిధ కార్మీక సంఘాల నాయకులు, సబ్యులతో  సిఐటీయూ జెండా అవిష్కరించారు . ఈ సందర్భంగా సురేష్ గొండ మాట్లాడుతు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిందని గర్వంగా చెప్పుకోవడం తప్పా కర్షకుల జీవితాల్లో నేటికి మార్పులు రాలేదని అన్నారు. ప్రభూత్వాలు మారినా, చట్టాలు ఎన్ని తెచ్చిన కూడా ఇప్పడికి వారు అసంఘటిత రంగాలలో అభధ్రత బావంతో బతుకులు గడపాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. నూచ మప్పై ఎనమిదవ  మేడే సంధర్భంగా ముఖ్య అథితిగా పాల్గోన్నారు. కార్యక్రమంలో జుక్కల్ మండల సిఐటీయూ అద్యక్షుడు జాదవ్ వీరయ్య, వాగ్మారే గోవింద్, సుశీల బాయి, అంన్వాడి నాయకులు సుమలత , బుజ్జిబాయి, శారద, , అశ్విని , శోభ, నర్సవ్వ, ఆశాలు,భవన నిర్మాణ కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.
Spread the love