ఉద్యమంలో అమరవీరుల పాత్ర గొప్పది

నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల పాత్ర ఎంతో గొప్పదని ప్రజాప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల దినోత్సవాన్ని మండల కేంద్రంతో పాటు కాచాపూర్, పెద్ద మల్లారెడ్డి, ఇస్సన్నపల్లి, రామేశ్వరపల్లి, బస్వాపూర్, తిప్పాపూర్ గ్రామాలలో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు ప్రజాప్రతినిధులు నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు హనుమంత రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రామచంద్రం, సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love