ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి 

– ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య 
నవతెలంగాణ- పెద్దవంగర:
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిట్యాల గ్రామానికి చెందిన యువతి యువకులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో డ్రైవింగ్ లైసెన్స్ లెర్నింగ్ డ్రైవింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి ట్రస్ట్ సహకారంతో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నాడని కొనియాడారు. ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ, మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ శిక్షణ శిబిరాల్లో వసతులు కల్పన, యువతి యువకుల కోసం ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అందజేత, కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసి గొప్ప మనస్సును చాటుకున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి దయాకర్ రావును కార్యకర్తలు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో యువత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రచారం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు కొల్లూరి రమేష్, గ్రామ ఉపాధ్యక్షుడు మొగలగాని హరీష్, ప్రధాన కార్యదర్శి వల్లపు పరమేష్, యూత్ అధ్యక్షుడు దేశెట్టి మహేష్, ఎస్ఎంసీ చైర్మన్లు జ్యోతి, పోతుగంటి శ్రీశైలం, సుంకరి నిహారిక ప్రశాంత్, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి దేశెట్టి వెంకటేష్, గట్ల సాయికృష్ణ, జాటోత్ మల్లికార్జున, దేశెట్టి వెంకటనారాయణ, ఈదురు యాకయ్య, ఈదురు పర్శరాములు, చిప్పల శంకర్, ఈదురు ఉపేందర్, సుంకరి బ్లెస్సీ తదితరులు పాల్గొన్నారు.
Spread the love