‘లోడి స్వచ్ఛంద సంస్థ’ సేవలు అభినందనీయం

నవతెలంగాణ-కాజీపేట
మానవసేవే మాధవసేవ అనే లక్ష్యంతో లోడి స్వచ్ఛంద సంస్థ దినదినాభివద్ధి చెందుతూ పేద ప్రజలకు సేవలు అందిస్తుంది. చిన్న,పెద,్ద కులమత తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకొని సేవ దక్పథంతో ముందుకు వెళతుంది. గత 57 సంవత్సరాలుగా లోడీ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు పథకాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా అభినం దనీయంగా నిలుస్తున్నాయి. 1966 లో ఖమ్మం జిల్లాలో లో డి స్వచ్ఛంద సంస్థ ప్రారంభించబడి నాటి నుండి నేటి వర కు సేవలు కొనసాగిస్తుంది.
ప్రస్తుతం తెలంగాణలో 11 జిల్లాల్లో సంస్థ సేవలు కొనసాగుతున్నాయి. 3800 మంది సభ్యులకు సేవలు అం దుతున్నాయి. రైతులు, మహిళలు, పిల్లలకు ఏదోఒక రూ పంలో సంస్థ సేవలు చేయడం జరుగుతుంది.
చెరువు పూడిక పనులు..
సంస్థ స్థాపించిన నాటి నుండి వ్యవసాయం అభివద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తూ చెరువులలో వర్షపు నీటిని ని లుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని ప్రారంభించక ముందే దాదాపు 165 గ్రామాలలో చెరువు పూడిక పనులను ప్రారంభించింది. చెరువులలో తీసిన మట్టి ని పొలాలలో వేస్తూ నీటిని నిలువ చేస్తూ వ్యవసాయానికి సరిపడే నీటిని అందించిన పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రా మానికి అమలు చేసింది. లోడీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభిం చిన చెరువు పూడిక పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్నిఅమలు చేయడంతో నేడు ప్రతి వ్యవసా యానికి సరిపడే నీటిని ప్రతి గ్రామంలోని చెరువులలో పుష్క లంగా ఉంటున్నాయి.
రైతులకు విత్తనాల పంపిణీ..
పంటలు పండించడానికి రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తూ లోడి స్వచ్ఛంద సంస్థ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 100 గ్రామాలకు పైగా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తుంది. సేంద్రీయ పద్ధతిలో విత్తనాలను త యారుచేసి రైతులకు అందించడం గొప్పవిశేషం. సంస్థ అందించిన విత్త నాలతో రైతులు పంటలు పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు..
హెచ్‌ఐవీ పాజిటివ్‌ కుటుంబాల పిల్లలకు పౌష్టికాహార పంపిణీ
హెచ్‌ఐవిబారిన పడినకుటుం బాల పిల్లలు వివక్షతకుగురికాకుండా వారు అందరిలా మనుషులు అనే మానవతా దక్పథంతో లోడి సంస్థ ఆలో చించి, బాధిత కుటుంబాల పిల్లలను హక్కున చేర్చుకొని అ లాంటి వారిని గుర్తించి మేమున్నామంటూ ప్రతి సంవత్స రం బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం బట్టలు ఆర్థి క సహాయాన్ని అందించి అండగా నిలుస్తున్నారు. టీబి బాధి త పిల్లలకు పౌష్టికాహారం ఆర్థికసహాయాన్ని అందిస్తు న్నా రు. ప్రతిసంవత్సరం వారికి పండగ వాతావరణాన్ని చూపిం చేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వారి హక్కును చేర్చుకొ ని ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. వారిపై వివక్షత చూపించొద్దంటూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా సమయంలో సేవలు..
ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారి లాక్‌ డౌన్‌ సమయంలో లోడీ స్వచ్ఛంద సంస్థ అందించిన సేవలు అభినందనీయం. కరోనా కష్టకాలంలో పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని లోడీ సంస్థ ముందుకు వచ్చి దాదాపు 15వేల మందికి నెలకు సరిపడే నిత్యవసర సరుకు లు, దుస్తులు పంపిణీ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, శానిటైజర్లు పేద ప్రజల వద్దకు వెళ్లి అందిం చారు. దాతల సహకారంతో అనేక రకాల సేవలు అందిస్తూ కరోనా సమయంలో పేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రజలకు అండగా నిలిచింది లోడి సంస్థ.
పేద విద్యార్థులకు అండగా లోడి సంస్థ
పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం వేలాదిమంది పేద విద్యార్థులకు మోడీ సంస్థ అండగా నిలుస్తుంది. విద్యార్థుల చదువుకు పాఠ్యపుస్త కాలతో పాటుగా ఉన్నత విద్య చదువుల కొరకు ఆర్థిక సహా యాన్ని అందిస్తూ ఆసరాగా నిలుస్తుంది. ప్రతి విద్యార్థి చది వితే సమాజం బాగుపడుతుంది అనే లక్ష్యంతో పేద విద్యార్థులను గుర్తించి సంస్థ సేవలను కొనసాగిస్తుంది. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సంస్థ ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా చెక్‌డ్యాముల నిర్మాణాలు చేపట్టి జగి త్యాల, జనగామ లాంటి జిల్లాలతో పాటుగా 45 గ్రామాలకు నీటినందిస్తుంది. చిరుధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. 60 గ్రామాలలో కోళ్లు పంపిణీ చేసి కోళ్ల పెంపకాన్ని అభివద్ధి చేస్తూఆర్థికంగా ముందుకు వెళ్లేలా అనేక కుటుంబాలకు అం డగా నిలుస్తుంది. దివ్యాంగులకు పౌష్టికాహారాన్ని అందిస్తు న్నారు. ఫాతిమా మహిళా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. రై తులు మహిళలు పిల్లలు లోడి స్వచ్ఛంద సంస్థ సేవలు అం దుకుంటూ అన్ని విధాల ముందుకు వెళ్తున్నారు. లోడీ స్వ చ్ఛంద సంస్థఅందిస్తున్న సేవలు కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
పేద ప్రజలకు సేవ చేయడమే సంస్థ లక్ష్యం
పేద ప్రజలకు, రైతులకు అ నారోగ్యాల బారినపడినకు టుం బాలకు, పేద విద్యార్థుల కు సేవ లందించడమే లక్ష్యంగా సంస్థ గత 57ఏళ్లుగా సేవలందిస్తుం దని లోడి స్వచ్ఛంద సంస్థ డైరెక్ట ర్‌ ఫాదర్‌ విజయపాల్‌ రెడ్డి అన్నా రు. 2015 నుండి నేటి వరకు 8 ఏళ్లుగా సంస్థ డైరెక్టర్‌ గా తాను విధులు నిర్వహించానని, ఎనిమిదేళ్ల కాలంలో సంస్థ పక్షాన ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం నూతన కార్యక్రమాలు చేపడుతూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నామని, సంస్థ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలుగా మారి అమలవడం గర్వంగా ఉంది, సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతులకు విత్తనాలు పంపిణీ చేసి, వ్యవసాయానికి సరిపడా నీటిని అందించడా నికి చెరువు పూడిక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
అనారోగ్యాల బారిన పడిన కుటుంబాల పిల్లలపై వివక్షత చూపకుండా వారిని సంస్థ పక్షాన హక్కును చేర్చుకొని వారికి అండగా నిలుస్తున్నాం. కరోనా సమయంలో తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు నిత్యవసర సరుకులు, దుస్తులు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా మాస్కులు తయారు చేయించి శానిటైజర్లు పంపిణీ చేశాం. 8 ఏళ్ల పాటు సంస్థ డైరెక్టర్‌గా సేవలందించడం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు రావాలని కోరారు.

Spread the love