తహసీల్దార్ కార్యాలయం ముట్టడి విజయ వంతం చేయాలి..

– దళిత బంధు, ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలకు పోడు హక్కులు కల్పించాలి 
– ప్రజాసంఘాల నాయకుల డిమాండ్..
 నవతెలంగాణ – వీర్నపల్లి 
తహశీల్దార్ కార్యాలయం ముట్టడి విజయ వంతం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేధిక నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ పిలుపు నిచ్చారు.వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామంలో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో పోడు రైతులతో, దళిత బంధు కోసం ఎదురుచూస్తున్నా దళిత కుటుంబలాతో ప్రజాసంఘాల నాయకులు సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని సర్వే చేసి ఎస్సీ, బిసి, మైనార్టీ అగ్రవర్ణ పేదలకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. బంజేరు గ్రామంలో దళిత పోడురైతులు తమ భూమికోసం పోరాడితే పోడు రైతులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సర్వే చేసిన దళితుల పోడు భూముల్లో మొక్కలు నాటరాని అన్నారు. ప్రభుత్వం స్పందించి పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో వైపు ప్రభుత్వం దళితులను ఆర్థికంగా ఎదుగలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయిందన్నారు. మండలానికి ఒక్క గ్రామానికి దళిత బంధు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. రెండో విడత దళిత బంధు ఇస్తామంటూ కాలయాపన చేయండం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు వెంటనే దళిత బందును ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని నమ్మించిన ప్రభుత్వం భూమి ఇవ్వకుండా తిరిగి దళితుల పోడు భూములను లాక్కోవడం ఏంటని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. దళితులందరికీ దళిత బంధు వచ్చేంతవరకు భూమిపై ఆధారపడిన ప్రతి నిరుపేద కుటుంబానికి పోడు భూముల హక్కు పత్రాలు అచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. 5న గురువారం పోడు రైతులతో , దళిత బంద్ కోసం దళిత కుటుంబాలతో వీర్నపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ముట్టడిస్తామని అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రజలు కార్మికులు పోడు రైతులు దళిత పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జాలపెల్లి మనోజ్ కుమార్ కొలపాక అనిల్, బండారి మహేష్, దినేష్,పోడు రైతులు, దళిత కుటుంబాలవారు పాల్గొన్నారు.
Spread the love