రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

– జగిత్యాల కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష
నవతెలంగాణ-జగిత్యాల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాష అధికారులను ఆదేశిం చారు. బుధవారం జిల్లా సమీకృత సముదాయాల భవనంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్‌.లత, మంద మకరంద, ఎస్పీ భాస్కర్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవరణ దినోత్సవ సంద ర్భంగా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జూన్‌ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉదయం 8 గంటల వరకు కార్యాలయాలలో పతాకా విష్కరణ ముగిం చుకుని రావాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులు, మున్సిపాలిటిలో చైర్మన్లు పతాకావిష్కరణ చేయాలని కలెక్టర్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్ర మాలను ప్రగతి నివేదికను సందేశం రూపంలో తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
జూన్‌ 2 న వేడుకలు ప్రారంభం
జూన్‌ 3న తెలంగాణ రైతు దినోత్సవం
జూన్‌ 4న సురక్షా దినోత్సవం
(రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కార్యక్రమాలు)
జూన్‌ 5న తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవం
జూన్‌ 6న తెలంగాణ
పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
జూన్‌ 7న సాగునీటి దినోత్సవం
జూన్‌ 8న ఊరూరా చెరువుల పండుగ
జూన్‌ 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు
జూన్‌ 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం (పరిపాలన సంస్కరణలు, ఫలితాలు)
జూన్‌ 11.న తెలంగాణ సాహిత్య దినోత్సవం ( రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు)
జూన్‌ 12న : తెలంగాణ రన్‌
జూన్‌ 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం
జూన్‌ 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం
జూన్‌ 15న తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
జూన్‌ 16న తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం
జూన్‌ 17న శనివారం :
తెలంగాణ గిరిజనోత్సవం
జూన్‌ 18న తెలంగాణ మంచి నీళ్ళ పండుగ
జూన్‌ 19న తెలంగాణ హరితోత్సవం
జూన్‌ 20న తెలంగాణ విద్యాదినోత్సవం
జూన్‌ 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
జూన్‌ 22న అమరుల సంస్మరణ
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్‌.లత, మంద మకరంద, ఎస్పి భాస్కర్‌, ఆర్దిఓలు వినోద్‌ కుమార్‌, మాధవి, జిల్లా అధికార ులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Spread the love