జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

– టీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-జగిత్యాలటౌన్‌
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్‌) జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష బుధవారం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్ష శిబిరాన్ని బీజేపీ నాయకులు డాక్టర్‌ శైలేందర్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న పాత్రికేయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనదని ఆరోపించారు. ఈ దీక్షలో జిల్లా అధ్యక్షుడు ఏన్‌ జయపాల్‌, కార్యదర్శి వెంకటరమణ, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు జీవన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరాజు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కిషన్‌ రెడ్డిలతో పాటు పలువురు జర్నలిస్టు నాయకులు గుర్రం చంద్ర శేఖర్‌, శ్రీనివాస్‌, లింగారెడ్డి, అక్కినపల్లి బాబు, కాంతారావు, లక్ష్మణ్‌, మేన్నెని శ్రీనివాసరావు, ఆర్‌ శ్రీని వాస్‌, గణేష్‌, గొనె గంగాధర్‌ తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో జర్నలిస్టులకు
ఇండ్ల స్థలాలు
జర్నలిస్టుల సమస్యలు తన దృషికి తీసుకువస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తొలి యేడాదిలో ఇళ్లతో పాటు ఇతర సమస్యలను పరి ష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ జీవన ్‌రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల టీిడబ్ల్యూజేఎఫ్‌ జర్నలిస్ట్‌ చేపట్టిన దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పిసిసి సభ్యుడు గిరి నాగ భూషణం, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బండ శంకర్‌తో కలిసి సందర్శించి జర్నలిస్టులకు సంఘీ భావం తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా విలేకర్లందరికీ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టీబీసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి, వారికి మద్దతు తెలిపారు.

Spread the love