తెలంగాణలో దంచి కొడుతున్న ఎండలు

నవతెలంగాణ – హైదరాబాద్:  తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సీజన్ లో తొలిసారిగా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా నిర్మల్​ జిల్లాలో 43.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఒక జిల్లాలో 43 డిగ్రీలు, 13 జిల్లాల్లో 42, 12 జిల్లాల్లో 41, 7 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. మరో నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే ప్రమాదముందని పేర్కొంది. శనివారం 21 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరు నాటికే టెంపరేచర్లు 45 డిగ్రీల మార్క్​ను అందుకోవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love