మహిళపై పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు

నవతెలంగాణ – అమరావతి: చిత్తూరు జిల్లా సోమల మండలంలో మహిళను పెట్రోల్ పోసి దుండగులు తగులబెట్టారు. మండల కేంద్రమైన సోమల జగనన్న కాలనీ సమీపంలో విజయలక్ష్మి అనే మహిళను పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా సగానికి పైగా కాలిపోయింది. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు మద్యం బాటిళ్లను గుర్తించారు. విజయలక్ష్మి అనే మహిళ ఓ రిటైర్డ్ టీచర్ భార్యగా పోలీసులు గుర్తించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love