నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని, వారి పని కాలాన్ని పొడిగించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున ఏఎన్ఎం సమస్యలపై కోటి లోని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ముందు యాదాద్రి భువనగిరి జిల్లా ఏఎన్ఎంల సమస్యలపై నిరసన చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంతో కలిసి పాల్గొని వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఏఎన్ఎంలు ప్రజలకు సేవ అందిస్తున్నారని వారిని అవుట్సోర్సింగ్ విధానంలో కాకుండా కాంట్రాక్టు విధానంలో కొనసాగించాలని, ఈ నెలతో కాల పరిమితి ముగుస్తున్నందున వారిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కమిషనర్ కి యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ – సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది .
ఈ కార్యక్రమంలో యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఫసిద్దీన్ యాదనాయక్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కడారి బలరాం, యడాద్రి భువనగిరి జిల్లా సిఐటియు కార్యదర్శి కల్లూరి మల్లేశం , యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, కవిత కోశాధికారి సంధ్య నాయకులు ప్రశాంతి, సౌందర్య ,పద్మ , సాయిదా ,విజయలక్ష్మి, స్వరూపలు పాల్గొన్నారు.