ఎదురులేని జకోవిచ్‌

ఎదురులేని జకోవిచ్‌– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
పారిస్‌ (ఫ్రాన్స్‌) : సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌కు ఎదురులేదు. డిఫెండింగ్‌ చాంపియన్‌ పురుషుల సింగిల్స్‌లో వరుసగా రెండో రౌండ్లోనూ అలవోక విజయం సాధించాడు. స్పెయిన్‌ ఆటగాడు రాబర్టోపై 6-4, 6-1, 6-2తో అలవోక విజయం సాధించాడు. ఏడు బ్రేక్‌ పాయింట్లు సాధించిన జకోవిచ్‌.. పాయింట్ల పరంగా 92-59తో ఆధిపత్యం చూపించాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) సైతం వరుస సెట్లలో విజయం సాధించాడు. 7-6(7-4), 6-2, 6-2తో డెవిడ్‌ గోఫిన్‌ను చిత్తు చేశాడు. రెండో సీడ్‌ జానిక్‌ సినర్‌ 6-4, 6-2, 6-4తో గాస్కెట్‌పై గెలుపొంది మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో నాల్గో సీడ్‌ రిబకినా 6-3, 6-4తో గెలుపొందగా.. సబలెంక 6-2, 6-2తో అలవోక విజయం సాధించింది. మడిసన్‌ కీస్‌ 6-0, 7-6(9-7)తో, స్విట్లోనా 6-4, 7-6(7-3)తో, సమ్సోనోవ 6-2, 6-1తో రెండో రౌండ్లో విజయాలు సాధించారు.

Spread the love