అచేతనం

నిండుగ పారుతున్న కెనాల్‌ ప్రవాహం
కనిపించినపుడల్లా నేను
ఆ కన్నీళ్ళలో మునిగి పోతాను…

కనీకనిపించనిదేదో తేలుతూ వస్తున్నది
అనిపించినపుడల్లా నేను
ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోతాను…

ఆ నీళ్ళని దాటి ఒడ్డున ఆ అచేతనం
చెట్టు కింద చాప పై ఒరిగి
నను చూసి నవ్వి నపుడల్లా
నేనకడే పాతాళానికి కుంగి పోతాను…

– అశోక్‌ గుంటుక
9908144099

Spread the love