యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ నీ నియమించాలి..

You should appoint a vice chancellor for the university..– ఎస్ ఎఫ్ ఐ అద్వర్యంలో సంతకాల సేకరణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ ఎఫ్ ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లోని బాయ్స్ హాస్టల్ ముందు తెలంగాణ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ ను నియమించాలని కోరుతూ శుక్రవారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 09 నెలల కాలం గడుస్తున్న ఇప్పటికీ వైస్ ఛాన్సలర్లను నియమించకపోవడం బాధాకరమ అన్నారు. యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక పోవడం తో యూనివర్సిటీ అభివృధ్ధి జరగడం లేదని వాపోయారు.రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీ లను నియమించిదని, యూనివర్సిటిలకు వైస్ ఛాన్సలర్లను నియమించడం లో అలసత్వం మానుకోవాలన్నారు. ప్రజా పాలన లో నైనా ఈ యూనివర్సిటీ అభివృధ్ధి కి అనేక నిధులు కేటాయిస్తారనుకుంటే నామమాత్రపు నిధులను కేటాయించడం దారుణ మన్నారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీ కి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నీ నియమించి అధికా నిధులను పెంచాలని లేకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటి అధ్యక్ష కార్యదర్శులు శివ, ప్రసాద్, యూనివర్సిటి సహయ కార్యదర్శి చరణ్, వినీత్, చక్రి , నాయకులు దినేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love