విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా నాయకులు టి.సుదర్శనం
నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణను వ్యతిరేకిస్తూ పేద ప్రజలకు విద్యను అందించేలా ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా నాయకులు టి .సుదర్శనం వల్లెంకుంట ఉన్నత పాఠశాలలో జరిగిన ఒక సమావేశంలో పిలుపునిచ్చారు.ఇందుకోసం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ 5 వ తేదీన హైదరాబాద్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంను విజయవంతం చేయాలని మండలంలోని ఉన్నత పాఠశాల వల్లెంకుంటలో పోస్టర్,కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజు నాయక్, సమ్మయ్య,ప్రకాష్, కవిత,నర్మద, పుష్పలత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ శ్రీకాళ, వంట కార్మికురాలు రాజేశ్వరి, సడవలి, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం పోరాటమే మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



