Saturday, July 18, 2026
E-PAPER
Homeసోపతిఅక్షరాయుధం

అక్షరాయుధం

- Advertisement -

అక్షరంతో జతకట్టి
పురిటి నొప్పులను బిగబట్టి
కవితకు జన్మనిచ్చింది
కవి హదయం
మంత్రసానై మురిసిపోయింది
చదివి.. విని..
కదిలిన హదయాలెన్నో
కరతాళ ధ్వనులు చేశాయి
రమణీయత వెదుక్కునే
రసహదయాలన్నీ కలిసి
రస రమ్య నత్యం చేసి మురిశాయి
కవితలోని అక్షరాలు
స్వేచ్ఛ వెలుగుల బావుటాలై
బ్రతుకు చీకటి దారుల్లో
స్వాతంత్ర కాంతులు నింపేశాయి
కవిత ఒక్కటే.. కదిలిన
హదయాలెన్నెన్ని లెక్క కడుతూ
పనికిమాలిన మనసులెన్నో
మాలిన్యాలని పులుముకుంటూ
మసకబారాయి.
శ్రీశ్రీ శ్రామిక వేదంకలాం
‘అణు’వాదం రవీంద్రుని గీతా పథం
సామాన్యుని పల్లె పదం
అన్నమయ్య ముక్తిమార్గం
భగత్‌సింగ్‌ విముక్తిమార్గం
మహాత్ముని శాంతి శతాఘ్ని
మార్గాలు ఏవైనా
అక్షరమే కొలమానం
గీతా ఖురాన్‌ ఏదైనా
అక్షరాల నాట్లువేస్తే
ఆలోచనలై మొలచిరావా
కవి గొంతుక నొక్కివేస్తే
ప్రజాగొంతుక బయల్పడదా
దష్టి.. దశ్యము.. ఒక్కటే అయితే
ఆలోచనే.. అక్షరాయుధం
డా|| డి.వి. రఘునాథ్‌, 9849661686

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -