Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతు శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు
వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
సబ్సిడీ విత్తనాల పంపిణీలో జుక్కల్ ఎమ్మెల్యే తోట
నవతెలంగాణ-మద్నూర్

రైతు శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన మద్నూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా సబ్సిడీ కంది విత్తనాలు, మినుములు, పెసర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎరువుల దుకాణ దారులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని, అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మండల వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులు మోసపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే సబ్సిడీ విత్తనాలను రైతులు వినియోగించుకోవాలని చెప్పారు.

నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకంలో భాగంగా ఎఫ్పీఓ మద్నూర్ ద్వారా రైతులకు సోయాబీన్ రకము DSB-34 మరియు మాక్స్1460 రకములు 1500 బస్తాలు రాయితీ మీద రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారాస్ సాయిలు, స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బండి గోపి, మండలంలోని వివిధ గ్రామాల  సర్పంచులు, నాయకులు, మండల రైతులు, ఏఈ వో లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -