లౌకికవాదం లేకుండా ప్రజాస్వామ్యమే ఉండదు

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
స్వాతంత్య్రం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని, రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లౌకికవాదం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఎంఎ బేబి అధ్యక్షతన హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నేత ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఎంపిక చేసిన వ్యాసాలకు హిందీ అనువాదం ‘మార్క్స్‌వాద్‌ లేదా ధరమ్‌ నిరపేక్ష (మార్క్సిజం అండ్‌ సెక్యులరిజం)’ అనే పుస్తకాన్ని సీతారాం ఏచూరి విడుదల చేశారు. కాలికట్‌ విశ్వవిద్యాలయం మార్క్సియన్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ విభాగం తయారు చేసిన పుస్తకాన్ని ప్రముఖ హిందీ కవి విష్ణునగర్‌ ఏచూరి నుంచి అందుకున్నారు.
”దేశ అస్తిత్వం సెక్యులరిజంపై ఆధారపడి ఉంది. హిందూ రాష్ట్రాన్ని వ్యతిరేకించినందుకు, లౌకికవాదం కోసం నిలబడినందుకు గాంధీని చంపారు. పాకిస్తాన్‌ ముస్లిం దేశంగా ఏర్పడినప్పుడు, భారతదేశం హిందూ దేశంగా ఎందుకు మారలేదని హిందూవాదులు లేవనెత్తారు. హిందుత్వ భావనకు హిందూ మతానికి సంబంధం లేదని స్వయంగా వీడి సావర్కర్‌ స్పష్టం చేశారు. ఎప్పటికీ సెక్యులరిజం సంరక్షకుడు ఈఎంఎస్‌ అని, ఈఎంఎస్‌ రచనలు నేటికీ సజీవంగా ఉన్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం గురించి తన మరణానికి కొద్దిసేపటి ముందు రాసిన వ్యాసంలో కూడా ఈఎంఎస్‌ బీజేపీ గురించి, దాని ఆలోచనల గురించి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారని ఏచూరి అన్నారు. జన సంస్కృతి, జనవాది లేఖక్‌ సంఫ్‌ు, జననాట్య మంచ్‌, కాలికట్‌ సర్వ కళాశాల. ఈఎంఎస్‌ చైర్‌ కోఆర్డినేటర్‌ పి అశోకన్‌, ఉపాధ్యాయుడు ఎన్‌ ఎం సన్నీ, ఢిల్లీ టీచర్స్‌ యూనియన్‌ నాయకుడు రాజీవ్‌ కన్వర్‌ మాట్లాడారు. ఈఎంఎస్‌ మనవళ్లు అనుపమ శశి, హరీష్‌ దామోదరన్‌ పాల్గొన్నారు.

Spread the love