తండాల్లో సారాయి జోరు

నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని ఆయా తండాల్లో ఎన్నికలవేళ అధికారుల తనిఖీలు లేకపోవడంతో నిర్భయంగా సారాయిని కాచి విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సారాయిని రుచి చూడడానికి పెద్ద నాయకులు కూడా ఇష్టపడుతున్నారని, వారికోసం ప్రత్యేకంగా తయారుచేసి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుoనారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని కొందరు తండావాసులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి నాటు సారా తయారుచేసి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Spread the love