టెన్త్ లో 10కి10 పాయింట్లు సాధించాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!


నవతెలంగాణ -పెద్దవూర: పదవ తరగతిలో విద్యార్థులు 10కి10 పాయింట్లు సాధించాలంటే ఈ క్రింది టిప్స్ తప్పనిసరిగా పాటించాలని ఆశ్రమ పాఠశాల వార్డెన్ బాలకృష్ణ, ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ విద్యార్థులకు సలహాలు సూచనలు చేశారు. మంగళవారం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెడిటేష్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు బాగా చదువుకొంటే ఉన్నత రంగాల్లో కూడా అంతే స్ట్రాంగ్ తో ముందుకు పోవచ్చునన్నారు. అందుకే ప్రతి విద్యార్థి తరగతి గదిలో టీచర్ చెప్పే ప్రతి మాటను వినాలన్నారు.10వ తరగతి విద్యార్థినీ,విద్యార్థులకు పబ్లిక్ పరీక్ష దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థికి 10 పాయింట్స్ సాధించాలని పట్టుదల, కృషి ఉందండం సహజం అని అన్నారు.
తరగతి గదిలో విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో కుస్తీ పడుతుంటారన్నారు. కానీ పరీక్ష సమయానికి అనుకొన్న మార్కులు రాలేదని బాధకూడా పడుతుంటారన్నారు. 10 వ తరగతిలోకి అడుగుపెట్టినప్పటి నుండే ముందు చెడు అలవాట్లు మానుకోవాలన్నారు. ఎందుకంటే 10 వతరగతి అనేది పునాది లాంటిది, పునాది ఎంత గట్టిగా వేసుకొంటే దానిపై ఎన్ని భవనాలు అయిన కట్టుకోవచ్చని తెలిపారు.అందుకే ప్రతి విద్యార్థి తరగతి గదిలో టీచర్ చెప్పే ప్రతి మాటను వినాలన్నారు. వారు చెప్పే సూచనలను పాటించాలన్నారు. టీచర్ చెప్పే టాపిక్ ను ఎప్పటికప్పుడు రీహార్సిల్ చేసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్టుల్లో పట్టు పెంచుకోవాలన్నారు. టీచర్ చెప్పే ప్రశ్నలను అర్థం చేసుకోని ప్రశ్నకు తగ్గట్టు జవాబు రాయడం నేర్చుకోవాలి. విద్యార్థులు ఇలాంటి ట్రిప్స్ పాటించినప్పుడే మీరు అనుకొన్న మార్కులు సాధించడానికి వీలవుతుందన్నారు. ఆ దిశగా విద్యార్థులు ముందుకు సాగాలని తెలిపారు.

Spread the love