అశ్రునయనాలతో వీరు జవాన్ కు కన్నింటి విడ్కోలు..

– హాజరైన ఆర్మీ ఉన్నతాధికారులు…
నవతెలంగాణ-డిచ్ పల్లి.
గత మూడు నెలలుగా మృత్యువుతో పోరాడి బ్రెయిన్ స్ట్రోక్ తో మృత్యువాత పడ్డ వీర జవాన్ చెవుల ప్రశాంత్ భౌతిక కాయాన్ని మంగళవారం అశ్రునయనాల మద్య కన్నిటి విడ్కోలు పలికారు. అంద్రప్రదేశ్ రాష్ట్రం లోని రాజమండ్రి లో విధులు నిర్వహిస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ సోకడంతో గత మూడు నెలలుగా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గత ఆదివారం మృతి చెందారు.ఈ విషయం ఇందల్ వాయి మండలంలోని చంద్రయన్ పల్లి గ్రామంలో తెలియడంతో కన్నింటి పర్యత మయ్యారు. ఆదివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తిసుకుని వస్తుండగా గ్రామస్తులు, యువకులు కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలంలోని పద్మజివాడి ఎక్స్ రోడ్డు నుండి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తు ఆర్మీ జవాన్ కు తోడు కోని వచ్చారు ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచి సైనిక లంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఒలింపిక్ జిల్లా ఉపాధ్యక్షులు, దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ అంతక్రియల్లో పాల్గోని మృతునికి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబనికి అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, ఆర్మీ ఉన్నతాధికారులు,రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love