అభివృద్ధిలో తమకు లేరు మరేవ్వరు  సాటి..

– అందరి సహకారంతో అన్ని రంగాల్లో నెంబర్ వన్..
– గ్రామానికి వన్నే తెచ్చిన మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. 
నవతెలంగాణ డిచ్ పల్లి
గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి
జాతిపిత మహాత్మా గాంధీ కన్నా కళలను నిజం చేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి నెంబర్ వన్ గా నిలిచింది డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి గ్రామం. మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, ఎంపిటిసి, యువజన సంఘాలు అందరు కలిసికట్టుగా గ్రామంలో ఏ సమస్య నెలకొని ఉన్న దాన్ని పరిష్కరిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి వైపు అడుగులు వేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలంతా అతలాకుతలం అయిన ఆ రోజుల్లో గ్రామంలో పారిశుధ్యం చేయిస్తూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజలు కరోన బారిన పడకుండా, గ్రామంలో ఉన్న 6వేల జనాభాకు అనుగుణంగా ఒక్కరు కూడా ఈ మహమ్మారి బారిన పడి ఆస్పత్రిలో చేరకుండ దానికి అనుగుణంగా చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా చేపట్టడంతో గాను ఆరోగ్య అవార్డు సైతం రావడం గ్రామస్తుల అదృష్టంగా భావించవచ్చు. పారిశుద్ధ్యం, తాగునీటి వ్యవస్థ పై చర్యలు చేపట్టడంలో గ్రామపంచాయతీ సఫలీకృతమైంది. ఇదే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు, రహదారులు, సిసి డ్రైన్లు, జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా కోటి రూపాయల వ్యయం తో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం చేపట్టి  గ్రామానికి వన్నే తెచ్చుకుని ప్రత్యేక స్థానం ను పొందారు. ఇదే కాకుండా బీసీ గురుకులం బాలురు, చెక్ డ్యాముల నిర్మాణాలు, రహదారుల నిర్మాణాలు తాగునీటికి కొదవ లేకుండా ప్రతి ఇంట మిషన్ భగీరథ ద్వారా జలసిరిలు,ఏ గ్రామంలో లేని విధంగా రెండు స్మశాన వాటికల నిర్మాణాలు, ఆలయాలు, పాఠశాల లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో కోట్ల రూపాయల మేర నిధులను ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గ్రామంలో పుట్టి గ్రామం రుణంను తిర్చుకోవడానికి తన ఎమ్మెల్సీ నిధులను మంజూరు చేస్తూ గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి  అహర్నిశలు కృషి చేసిన గ్రామ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ సహాయ సహకారాలతో సర్పంచ్ పాపాయి తిరుపతి, ఉప సర్పంచ్ ఎంకనోల్ల రమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ, ఎంపిటిసి, గ్రామస్తులు సహాయ సహకారాలతో గ్రామాన్ని పురోభివృద్ది వైపు దృష్టిసారించుకొని అందరూ కలిసికట్టుగా ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుకొని నంబర్ వన్ స్థానాన్ని పొందారు. గ్రామపంచాయతీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోట నుండి వచ్చే నిధులను ఎవ్వరు కాదనకుండా ప్రతి గల్లీ గల్లీలో రహదారులు సిసి డ్రైన్లను నిర్మాణం చేపట్టారు గ్రామం మొత్తంలో 1000 మీటర్ల మీద సిసి రహదారులు 2000 మీటర్ల మీద సిసి డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టి ఎన్నో గ్రామాలకు ఆదర్శ గ్రామంగా నిలిచింది. ప్రస్తుతం గ్రామంలో సమస్యలు లేకుండా కృషి చేసిన సర్పంచ్ పాపాయి తిరుపతి, ఉప సర్పంచ్ ఎంకన్న రమేష్ గ్రామ అభివృద్ధి కమిటీ,ఎంపిటిసి, ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ, బిఅర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ గంగాధర్ గౌడ్ గ్రామంలో బీసీ గురుకుల తీసుకురావడానికి అందరి సహకారం చేసుకుంటూ కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకొని గురుకులం ను ఏర్పాటుచేసి మెరుగైన ఫలితాలను సాధిస్తూ పలు సందర్భాలలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేస్తూ అద్దెపకులకు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత ఈ గురుకులంలో వందలాదిమంది జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాల నుండి విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత ఉన్నత పాఠశాలలో కూడా మెరుగైన సౌకర్యాల కల్పన కోసం గ్రామపంచాయతీ నుండి అవసరమున్న వాటిని సమకూరుస్తూ మెరుగైన ఫలితాలు సాధించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.
గ్రామానికి వచ్చిన నిధులు…
ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షలతో అదనపు గదులు నిర్మాణం, గ్రామపంచాయతీ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.9 లక్షలు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడి భవనాల మరమ్మతులకు రూ.20 లక్షలు, చెక్ డ్యామ్ నిర్మాణానికి మూడు కోట్లు, నూతన కాలువల నిర్మాణానికి రూ.30 లక్షలు, ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణానికి ఎమ్మెల్సీ గా ఉన్న విజీ గౌడ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం నుండి రూ.50 లక్షలు, రెడ్ క్రాస్ సొసైటీ నుండి రూ.50 లక్షలు కలుపుకొని కోటి రూపాయలతో సుందరవంతంగా భవన నిర్మాణం, గార్డెన్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.80 లక్షల రూపాయలతో గ్రామంలో 1000 మీటర్ల మేర సిసి రహదారుల నిర్మాణం దీనిలో గ్రామపంచాయతీ, ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ నిధులతో పనులను పూర్తి చేశారు. గ్రామంలో 2000 మీటర్ల సిసి డ్రైనేజీల నిర్మాణానికి రూ.80 లక్షల రూపాయలను వెచ్చించి పనులను పూర్తి చేశారు.
కుల సంఘా భవనాల నిర్మాణం…
             శేరు సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, పుప్పల కుల సంఘాలకు రూ.10 లక్షలు, రజక సంఘంకు ఐదు లక్షలు, ఇర్ల పేద్దోల్ల సంఘానికి రూ.5 లక్షలు, ఇర్ల చిన్నోల్ల సంఘానికి రూ.5 లక్షలు, గొల్ల, కురుమ సంఘాలకు రూ.10 లక్షలు, మాల సంఘానికి రూ.5 లక్షలు, మాదిగ సంఘానికి రెండు లక్షలు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం హరిజనవాడలో రూ.10 లక్షలు, రాంపూర్ లక్ష్మీనరసింహస్వామి దత్తాత్రేయ ఆలయం వద్ద కళ్యాణ మండపానికి రూ.9 లక్షలు, హనుమాన్ ఆలయం వద్ద షేడ్డు నిర్మాణానికి ఐదు లక్షలు, వీఆర్వో బిల్డింగ్ నిర్మాణానికి ఐదు లక్షలు, పశువుల ఆసుపత్రికి రూ.16 లక్షలు, అగ్రికల్చర్ గోదాం నిర్మాణానికి రూ.10 లక్షలు, రైతు వేదికకు రూ.30 లక్షలు, మన ఊరు మన బడి కింద పాఠశాలలో బాత్రూంలు, కిచెన్ షెడ్, సంపు, ఇతర మరమ్మతు పనులకు గాను రూ.60 లక్షల రూపాయలు, గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుండి స్వాగత తోరణం వరకు వీధి దీపాల కోసం స్తంభాలు, రైతు వేదిక నుండి ఓల్డ్ ఏజ్ హోం, ప్రాథమిక పాఠశాల ,స్మశాన వాటిక వరకు రెండు లక్షల రూపాయలు గ్రామపంచాయతీ నిధులతో స్తంభాలను ఏర్పాటు చేసి వీధిదీపాలను అమర్చారు. గ్రామమంతా చిమ్మ చీకటి లేకుండా ప్రతిచోట స్తంభాలను ఏర్పాటు చేసి వీధి దీపాలను అమర్చారు. ప్రభుత్వం ఏ పిలిపించిన ముందు వరుసలో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నరు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో ఉన్న అమూరికి కాల్వలను పరిశుభ్రం చేస్తూ అత్యవసరం ఉన్నచోట రహదారుల కిరివైపు మొరంబిసి గుంతలు లేకుండా చేపట్టడంలో గ్రామపంచాయతీ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. గ్రామంలో స్మశాన వాటిక వద్ద ఒక లక్ష రూపాయలతో బోర్ మోటార్ బిగింపు, లక్ష రూపాయలతో మొరం ను వేసి చదును చేయడం దానిలో ముందుగా ఉన్న రాళ్లు రప్పలను తొలగించడానికి రెండున్నర లక్షల రూపాయలను వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దారు. హరితహారం లో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్ నెలకొల్పి రహదారులకు ఇరువైపులా మొక్కలను పెంచి ఆహ్లదాన్ని ఇచ్చే విధంగా గ్రామపంచాయతీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అనునిత్యం ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా మొక్కలను నీరు వేస్తూ దాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ సంరక్షించారు. ఏ గ్రామంలో చూసిన ఒకే ఒక స్మశాన వాటిక ఉండేది.కాని ఇక్కడ రెండు స్మశాన వాటికలను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సుందరంగా  తీర్చిదిద్దారు. ఇదే కాకుండా ఒక డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, మన ఊరు మన నర్సరీ, మూడు గ్రీన్ పార్కులను ఏర్పాటు చేశారు. దీనిలో ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్, వైకుంఠ ధామం, గ్రామంలో ఇతర చోట గ్రీన్ పార్కులను ఏర్పాటు చేసి గ్రామస్తులను పంచి పెట్టడంలో గ్రామపంచాయతీ ప్రముఖ పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సర్పంచ్ పాపాయి తిరుపతి ,ఉప సర్పంచ్ ఎంకన్నోల్ల రమేష్, గ్రామపంచాయతీ పాలకవర్గం కృషి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామానికి త్వరలో పత్రిక ఆరోగ్య కేంద్రం వచ్చే అవకాశం ఉందని అది త్వరలో వస్తే గ్రామమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని సర్పంచ్ పాపాయి తిరుపతి నవ తెలంగాణ కు వివరించారు.
          రాంపూర్ గ్రామం నుండి ఇందల్వాయి మండలంలోని వెంగళ్ పాడ్ తాండవరకు రెండవ చెక్ డ్యామ్ నిర్మాణానికి రెండు కోట్ల రూ.50 లక్షల రూపాయలను మంజూరు అయ్యాయి. రాంపూర్ గ్రామం నుండి కమలాపూర్ బీటి రోడ్డు రెన్యువల్ కు రూ.60 లక్షలు, ఇదే కాకుండా గ్రామానికి చెందిన యువకులు గల్ఫ్ లో ఉంటూ గల్ఫ్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి రూ.20 లక్షల రూపాయలను అందజేసి నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామానికి చెందిన దాత స్వర్గరథం ను గ్రామ పంచాయతీ కి అందజేశారు. ఇదే కాకుండా గ్రామపంచాయతీ నిధులతో నూతనంగా ఒక ట్రాక్టర్, ట్యాంకర్ ను కొనుగోలు చేసి అనునిత్యం చెత్తచెదారం లేకుండా, హరితహారం లో భాగంగా మొక్కలను సందర్శించడానికి, గ్రామ పంచాయతీ లో ఉన్న మొత్తం పదిమంది కార్మికులతో పనులను ఇప్పటికప్పుడు శుభ్రత చేస్తున్నారు. ఇదే కాకుండా ప్రతి వారం గ్రామంలో జరిగే వారంతపు సంతలో చెత్త చెదారం లేకుండా పరిశుభ్రత చేయిస్తూ గ్రామస్తులు ఇతర గ్రామాల ప్రజల మన్నానలను పొందుతున్నారు.
అందరి సహకారంతోనే గ్రామం అభివృద్ధి వైపు పరుగులు … 
సేవ చేసే భాగ్యం కల్పించారు..
సర్పంచ్ పాపాయి తిరుపతి..
గ్రామ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గ్రామ అభివృద్ది కమిటీ, గ్రామస్తుల సహాయ సహకారాలతో కోట్ల రూపాయల మేర నిధులు మంజరై గ్రామం మొత్తంలో అభివృద్ధి ధ్యేయంగా పాలకవర్గంతో కలిసి కృషి చేశా.. గ్రామస్తులు సేవ చేసే భాగ్యం కల్పించడంతోనే ఈ అవకాశం వచ్చింది.. ఎల్లప్పుడూ వారందరికీ రూణ పడి ఉంటా..గతంతో పోల్చుకుంటే ఈసారి కనివిని ఎరుగని రీతిలో వృద్ధి సాధించం.రాబోవు రోజుల్లో అందరితో కలిసి గ్రామంలో అవసరాల మేరకు నిధులను తీసుకురావడానికి శాయ శక్తుల ప్రయత్నం చేసి అభివృద్ధిలోనే జిల్లాలోనే నంబర్ వన్ లో ఉండే విధంగా కృషి చేస్తా.. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా తడి పొడి చెత్త ను ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి పంపించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నాం.. దీనికిగాను ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు..
గ్రామస్తులు నన్ను ఎన్నుకోవడం మా అదృష్టం.. 
మళ్లీ అవకాశం కల్పిస్తే మరింత సేవ చేస్తా..
ఎంకనోల్ల రమేష్…ఉప సర్పంచ్..
గ్రామస్తులు నన్ను ఎన్నుకోవడం నా అదృష్టం మళ్లీ అవకాశం కల్పిస్తే మరింత సేవ చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అందరి సహాయ సహకారాలు పాలకవర్గం కృషి అమోఘం.  గ్రామం ముద్దుబిడ్డ అభిమాన నాయకుడు మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ కృషి ఫలితం తోనే కోట్లాది రూపాయల మేర నిధులు మంజూరు కావడం హర్షించదగ్గ విషయం.. ఎంత చేసిన పుట్టిన గ్రామం రూణం తీర్చుకోలేనిది. గ్రామం అభివృద్ధి చెందడానికి గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, యువకుల సహాయ సహకారాలతోనే అభివృద్ధి సాధించం. మళ్లీ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతా. జిల్లాలోని రాంపూర్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని అది అభివృద్ధిలో చేసి చూపం. మునుముందు ఇంకా చేసే పనులు ఉన్నాయి. వాటన్నింటిని పూర్తి చేయడానికి శక్తివంతన లేకుండా అందరి సహకారం తిస్కుంటు మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాం.. ఇదే కాకుండా తనవంతుగా స్వంచంద కార్యక్రమాలు చేపడుతున్న..
Spread the love